సీపీఐకి షాక్ ఐటీ ఝలక్
రూ. 11 బకాయిలు చెల్లించండి
న్యూఢిల్లీ – పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. కేంద్ర ఆదాయపు పన్ను శాఖ ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే రూ. 1700 కోట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి నోటీసు జారీ చేసింది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన ఖాతాలను స్తంభింప చేసింది.
తాజాగా కూటమిలో భాగంగా ఉన్న సీపీఐ పార్టీకి షాక్ ఇచ్చింది. శుక్రవారం నోటీసులు జారీ చేసింది ఆ పార్టీకి. పాత పాన్ కార్డు ఉపయోగించారంటూ మండిపడింది. ఇందుకు సంబంధించి రూ. 11 కోట్లు చెల్లించాలని నోటీసులో ఆదేశించింది.
దీనిపై విస్తు పోయిన సీపీఐ స్పందించింది. తాము న్యాయ స్థానాన్ని ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఎలాంటి మదింపు ఉత్తర్వులు, పత్రాలు లేకుండానే నోటీసులు ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వివేక్ థంకా ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం ప్రతిపక్షాలకు మాత్రమే నోటీసులు జారీ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్యలు తప్ప మరోటి కాదన్నారు.