కేటీఆర్ కు చిప్ప కూడు తప్పదు
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కామెంట్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. తనను టార్గెట్ చేస్తూ కొనసాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆపై అరెస్ట్ జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకునే సమయం రానే వచ్చింది. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది ప్రత్యేక టీమ్. బీఆర్ఎస్ పనై పోయిందని అన్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుగుతోందని చెప్పారు.
కేటీఆర్ స్థాయికి మించి మాట్లాడుతున్నాడని, ఇంకా అహంకార పూరిత ధోరణితోనే వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఎవరైనా సరే ఇతర కుటుంబ సభ్యుల కాల్స్ వింటారా అని నిలదీశారు. కొన్ని ఫోన్లు విన్నామని చెప్పడం సిగ్గు అనిపించడం లేదా అని కేటీఆర్ పై మండిపడ్డారు.
త్వరలో కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు. చర్లపల్లి జైలులో చిప్ప కూడు తినక తప్పదని స్పష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ నేతలు చెప్పినట్లు విన్న పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో గుర్తు పెట్టుకోవాలన్నారు.