టీడీపీలో చేరిన నిఖిల్ సిద్ధార్థ
పార్టీలోకి ఆహ్వానించిన నారా లోకేష్
అమరావతి – ప్రముఖ నటుడు నిఖిల్ సిద్దార్థ ఊహించని షాక్ ఇచ్చారు. టాలీవుడ్ లో నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇటీవల తను నటించిన కార్తికేయ చిత్రం బిగ్ సక్సెస్ సాధించింది. ఈ తరుణంలో తను సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం విస్తు పోయేలా చేసింది.
నిఖిల్ సిద్దార్థ్ ను పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో శాసన సభ , లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. నిఖిల్ సిద్దార్థ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నువ్వా నేనా అన్న రీతిలో ప్రస్తుతం పోటీ కొనసాగుతోంది.
హీరో ఇమేజ్ స్వంతం చేసుకున్న నిఖిల్ పార్టీ పరంగా ప్రచారం చేయనున్నారు. తను పార్టీలో చేరడం వల్ల మరింత పార్టీకి బలం చేకూరుతుందని స్పష్టం చేశారు నారా లోకేష్. మరికొందరు కూడా తమ పార్టీలో చేరబోతున్నట్లు తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీతో కలిసి టీడీపీ కూటమిగా ఏర్పడింది. బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. రాబోయే ఎన్నికల్లో కూటమి సత్తా చాటుతుందని జోష్యం చెప్పారు నారా లోకేష్.