పాల‌నా ప‌రంగా య‌డ్యూర‌ప్ప అనుభ‌వం అవ‌స‌రం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన నూత‌న సీఎం డీకేఎస్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. బుధ‌వారం నూత‌న ముఖ్య‌మంత్రిగా కొలువు తీరారు క‌ర్నాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ప్రెసిడెంట్, మాజీ డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా వివిధ పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుల‌ను క‌లుసుకున్నారు. వారి ఆశీర్వాదం కూడా పొందారు. డీకే శివ‌కుమార్ ముందుగా మాజీ భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి హెచ్ డి దేవగౌడ నివాసానికి వెళ్లారు. ఆయ‌న కాళ్ల‌కు న‌మ‌స్క‌రించారు. దేవ‌గౌడ ఆశీర్వాదం అందుకున్నారు. అనంత‌రం నేరుగా మాజీ సీఎం, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు యెడ్యూర‌ప్ప నివాసానికి వెళ్లారు. ఆయ‌న ఇంట్లో ఉన్న పూజ గ‌దికి వెళ్లి పూజ‌లు చేశారు. అనంత‌రం యెడ్డీని ఆలింగ‌నం చేసుకున్నారు.

త‌న‌తో కొద్ది సేపు బేటీ అయ్యారు. ఇవాళ జ‌రిగే సీఎం ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని ఆహ్వానించారు. దీనికి యెడ్యూర‌ప్ప సైతం సంతోషంగా స్వీక‌రించారు. తాను తప్ప‌కుండా వ‌స్తాన‌ని తెలిపారు. మాజీ ముఖ్య‌మంత్రి యెడ్డీతో భేటీ అనంత‌రం నూత‌న ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ మీడియాతో మాట్లాడారు. సీనియర్ నాయకుల అనుభవం, మార్గదర్శకత్వం రాష్ట్ర అభివృద్ధికి ఒక దిక్సూచిగా నిలుస్తాయ‌ని అన్నారు. కర్ణాటక పురోగతి , ప్రజల సంక్షేమం కోసం తాము కృషి చేస్తున్న తరుణంలో, సీనియర్ నాయకుల అనుభవం , మార్గదర్శకత్వం కోసం తాను ఆస‌క్తితో ఎదురు చూస్తున్న‌ట్లు చెప్పారు.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *