హైడ్రా కమిషనర్ సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేసిన కాలేజీలు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో ద‌ర్జాగా కాలేజీలు నిర్వ‌హిస్తున్న యాజ‌మాన్యాలు ఏకంగా హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సంత‌కాన్ని ఫోర్జరీ చేసిన బాగోతం బ‌ట్ట‌బ‌య‌లైంది. ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది ఫైర్ ఎన్‌వోసీపై రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేసిన ఎనిమిది ప్రైవేట్ కాలేజీలుజ. ఈ సంద‌ర్బంగా ప‌రిశీలించిన అధికారులు విస్తు పోయారు. ఇది పూర్తిగా హైడ్రా క‌మిష‌న‌ర్ సంత‌కం కాద‌ని గుర్తించారు. ఆ ఎనిమిది కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు హైడ్రా అడిషనల్ డైరెక్టర్ పాప‌య్య‌.

త‌ప్పుడు సంత‌కాల‌తో ఫైర్ ఎన్ఓసీ సమర్పించిన కాలేజీల వివ‌రాలు ఇక్క‌డ ఉన్నాయి. వాటిలో హైద‌రాబాద్ లోని హైందవీ జూనియర్ కాలేజీ (బర్కత్‌పుర), రెసోనెన్స్ జూనియర్ కాలేజీ (SR నగర్), ప్రియాంక జూనియర్ కాలేజీ (మెహిదీపట్నం), మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజీ (విద్యానగర్), శ్రీచైతన్య జూనియర్ కాలేజీ (చంద్రాయణగుట్ట), న్యూ ఎరా జూనియర్ కాలేజీ (చిక్కడపల్లి), షాహీన్ జూనియర్ కాలేజీ (శివరాంపల్లి), వశిష్ట జూనియర్ కాలేజీ (తెల్లాపూర్)లపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండ‌గా మరో 60 కాలేజీల ఎన్‌వోసీలను స్క్రూటినీ చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

  • Related Posts

    80 శాతం సబ్సిడీతో1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

    అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో రైతుల పంట‌ల సాగుకు సంబంధించి 80 శాతం స‌బ్సిడీతో 1.31 ల‌క్ష‌ల క్వింటాళ్ల విత్త‌నాల‌ను స‌ర‌ఫ‌రా చేశామ‌ని తెలిపింది. ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళిక కోసం రూ. 60 కోట్లు…

    వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్టుకు ‘సమ్మక్క-సారలమ్మ’ పేరు పెట్టండి

    హైద‌రాబాద్ : ధ‌ర్మ స‌మాజ్ వాది పార్టీ అధ్య‌క్షుడు డాక్టర్ విషార‌ద‌న్ మ‌హారాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి వరంగ‌ల్ ఎయిర్ పోర్టుకు రుద్ర‌మ‌దేవి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *