విజయ్ రాఘవేంద్ర హీరోగా సంజీవ్ మేగోటి మూవీ

హైదరాబాద్: క్రైమ్, యాక్షన్, థ్రిల్‌తో కూడిన విభిన్న కథలను తెరపై ఆవిష్కరించడంలో తనదైన ముద్ర వేసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘పోలీస్ కంప్లైంట్’ మూవీతో హిట్ కొట్టిన‌ ఆయన.. ఇప్పుడు కన్నడలో తన అప్‌క‌మింగ్ మూవీ రూపొందించ బోతున్నారు. ‘ఆన్ డ్యూటీ’ టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ మూవీ కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబానికి చెందిన ప్రముఖ హీరో విజయ్ రాఘవేంద్ర కథానాయకుడిగా నటించనున్నాడు.

ఇప్పటికే క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ జానర్‌లో పలు విభిన్న చిత్రాల్లో నటించిన విజయ్ రాఘవేంద్ర.. సంజీవ్ మేగోటి చెప్పిన ఈ సరికొత్త కథకు ఓకే చెప్పడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. విజయ్ రాఘవేంద్ర ఫిల్మోగ్రఫీలో కూడా క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్ కథలు కనిపిస్తాయి. విజయ్ రాఘవేంద్ర ఇటీవ‌ల న‌టించిన‌ సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవ‌ల త‌మత‌మ సినిమాల‌తో సూప‌ర్ హిట్ కొట్టిన హీరో విజయ్ రాఘవేంద్ర, డైరెక్ట‌ర్ సంజీవ్ మేగోటి క‌లిసి రూపొందించ‌బోయే ప్రాజెక్టు ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ హిట్ కాంబినేష‌న్‌పై అప్పుడే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

  • Related Posts

    త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ ను ప్ర‌శంసించిన అట్లీ

    చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను ప్రశంసించాడు డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్. ఆయ‌న విజయ్ సేతుపతిపై పరోక్ష విమర్శలు చేశాడు. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘బత్తా’ (Baththa) చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అట్లీ మాట్లాడారు.…

    హైదరాబాద్‌లో అతిపెద్ద సినిమా స్క్రీన్‌కు రంగం సిద్ధం..?

    హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ఏషియన్ సినిమాస్ కలిసి హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఓ భారీ ప్రీమియం సినిమా ప్రాపర్టీని తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో “వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్” ఏర్పాటు చేయడానికి పని చేస్తున్నామని ఏషియన్ సినిమాస్ అధినేత…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *