హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. తను ప్రస్తుతం కాకా మూవీలో బిజీగా ఉన్నారు. అయితే తనకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. తన సారథ్యంలో మెగావర్స్ టాక్ షో త్వరలో రానుందని టాక్. ఇందులో ఇప్పటికే బిగ్ బాస్ తో దుమ్ము రేపుతున్న , అత్యంత జనాదరణ పొందిన నటుడు, ప్రయోక్త అక్కినేని నాగార్జునతో పాటు నాగ చైతన్య, అక్కినేని అఖిల్ కూడా ఈ షోలో కనిపించనున్నారని, ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే మెగాస్టార్ చిరంజీవి త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ‘మెగావర్స్’ అనే టాక్ షోతో హోస్ట్‌గా పరిచయం కాబోతున్నారు. ఈ షోలో పలువురు ప్రముఖ సెలబ్రిటీలు అతిథులుగా రానున్నారనే వార్తలతో తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ షోలోని ఒక ప్రత్యేక ఎపిసోడ్‌లో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ అక్కినేని కలిసి కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ ఇది నిజమైతే మెగా అక్కినేని కుటుంబాలు ఒకే వేదికపై కనిపించనున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ కూడా ఒక ప్రత్యేక ఎపిసోడ్‌లో కలిసి పాల్గొనవచ్చని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అక్కినేని త్రయం కూడా ఈ షోలో కనిపించవచ్చనే వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
చిరంజీవి హోస్ట్ చేస్తున్న ‘మెగావర్స్’లో ఆసక్తికరమైన సంభాషణలు, సెలబ్రిటీల అనుభవాలు , తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన కథలు ఉండనున్నాయి. ఈ షోను గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్ , సోల్ ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.




