Wednesday, 4 November 2026

వంగా సందీప్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

newsseals-VangaSandeepreddy

హైద‌రాబాద్ : ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏదైనా తీవ్రమైన నేరం లేదా విషాదకర సంఘటన జరిగినప్పుడు సినిమాలను నిందించే ధోరణిని తప్పుబట్టారు. ఇలాంటి ఘటనల వెనుక ఉన్న అసలు కారణాలను అన్వేషించాలని, సరైన విశ్లేషణ లేకుండా సినిమాలపై నిందలు వేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవడం , సామాజిక సమస్యలకు పరిష్కారాలను వెతకడంపైనే దృష్టి సారించాలని ఆయన నొక్కి చెప్పారు. సోషల్ మీడియా వేదిక ‘X’ (ట్విట్టర్)లో ఆయన పంచుకున్న ఈ అభిప్రాయాలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ‌కు దారితీశాయి.

నేరాల వెనుక ఉన్న అసలు కారణాలను అర్థం చేసుకోవడం ముఖ్యమని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు. వాస్తవాలను పరిశీలించకుండా, ప్రతి దురదృష్టకర సంఘటనను సినిమాలతో ముడిపెట్టడం సరైన పద్ధతి కాదని సూచించారు. దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు సమాజం ముందుగా బాధితుల పక్షాన నిలబడి, సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు. కేవలం సినిమాలను నిందించడం వల్ల సమస్యలు పరిష్కారం కావన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆపలేమ‌ని పేర్కొన్నారు వంగా సందీప్ రెడ్డి. కొందరు వ్యక్తులు విషాదకర పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని, తామేదో సామాజిక సంస్కర్తలమని చెప్పుకోవడం పట్ల వంగా అసహనం వ్యక్తం చేశారు . సున్నితమైన పరిస్థితులను ఎవరూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకూడదని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *