Wednesday, 4 November 2026

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ర‌జ‌నీకాంత్ జైల‌ర్ -2

newsseals-Jailer-2OTT

చెన్నై : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కీ రోల్ పోషించిన చిత్రం సీక్వెల్ జైల‌ర్ -2 దుమ్ము రేపింది. అక్టోబ‌ర్ 15న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై రూ. 700 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. సూప‌ర్ స్టార్ సినీ కెరీర్ లో భారీ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ప్ర‌స్తుతం ర‌జ‌నీ కాంత్ మూవీని చూడ‌ని వారి కోసం ఓటీటీలో ఎప్పుడు వ‌స్తుందోనని ఎంత‌గానో వేచి చూస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అత్యంత ఆసక్తికరమైన యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’, త్వరలో ఓటీటీ వేదికపై విడుదల కావడానికి సిద్ధమవుతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైనప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ చిత్రం నవంబర్ 12 లేదా 13 తేదీల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారిక తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది . ఈ సీక్వెల్‌లో రజనీకాంత్ ‘టైగర్ ముత్తువేల్ పాండియన్’ పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు రమ్యకృష్ణ, యోగి బాబు, ఎస్.జె. సూర్య, విద్యా బాలన్, మోహన్‌లాల్ , శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు .ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. రజనీకాంత్ నటించిన ఈ యాక్షన్ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *