Wednesday, 4 November 2026

రజనీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలోకి శ్రీలీల రాక

newsseals-Sreeleela

చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధర్మన్’లో నటి శ్రీలీల భాగమయ్యారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ చిత్ర బృందం ఒక ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఆమెలో ఉన్న ఉత్సాహాన్ని, శక్తిని ప్రశంసిస్తూ, ఆమెకు సాదర స్వాగతం పలికారు. శ్రీలీల ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్‌లో చేరి పోయారు. అంతే కాకుండా ఈ ప్రాజెక్టులో ఒక కీలక పాత్ర కోసం నటుడు రామ్ పోతినేనిని కూడా ఎంపిక చేసినట్లు సమాచారం. అశ్వత్ మరిముత్తు రచన , దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మన్’ చిత్రాన్ని, కమల్ హాసన్‌కు చెందిన ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ సంస్థ, ‘టర్మెరిక్ మీడియా’తో కలిసి నిర్మిస్తోంది.

ఈ చిత్రంలో నయనతార, రాశీ ఖన్నా, సిమ్రాన్ ,యోగి బాబు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. పలువురు ప్రముఖ నటీనటులు కలిసి నటిస్తుండటంతో ‘ధర్మన్’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్ల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ర‌జ‌నీకాంత్ కు 2026వ సంవ‌త్స‌రం బాగా అచ్చొచ్చింది. ఆయ‌న ఇంట్లో ద‌స‌రా పండ‌గును మ‌రింత ఘ‌నంగా చేసుకునేలా చేసింది. ఆ సినిమా సీక్వెల్ జైల‌ర్ -2. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఏకంగా రూ. 700 కోట్లు వ‌సూలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *