Tuesday, 3 November 2026

అమిత్ షాతో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ భేటీ

newsseals-Chiranjeevi

హైద‌రాబాద్ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో మ‌ర్యాద పూర్వ‌కంగా భేటీ అయ్యారు ప్ర‌ముఖ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌. సినిమా రంగం గురించి వీరు ప్ర‌ధానంగా చ‌ర్చించారు. రోజు రోజుకు టెక్నాల‌జీ ప‌రంగా కీల‌క మార్పులు చోటు చేసుకోవ‌డం, ఇందులో త‌మ గురించి ఫేక్ వీడియోలు సృష్టించ‌డంపై తండ్రీ కొడుకులు అమిత్ షాకు వివ‌రించారు. ఈ సంద‌ర్బంగా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ , డీప్ ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగం పెరగడం ప‌ట్ల వాపోయారు. ప్ర‌ధానంగా సినీ రంగానికి చెందిన‌ కళాకారులు, మన పరిశ్రమపై వాటి తీవ్రమైన ప్రభావం గురించి తెలిపారు.

దీనిపై సానుకూలంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించార‌ని స‌మావేశం అనంత‌రం చిరంజీవి, రామ్ చ‌ర‌ణ‌లు వెల్ల‌డించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా తాము ఆయ‌న‌తో క‌లిసిన విష‌యాన్ని తెలిపారు. ఫోటోలు కూడా షేర్ చేశారు. ఏఐ, డీప్ ఫేక్ వీడియోలను ప్ర‌సారం చేయ‌డం, పోస్టులు పెట్ట‌డం ప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని త‌మ‌కు హామీ ఇచ్చార‌ని పేర్కొన్నారు చిరంజీవి, రామ్ . ప్రభుత్వం ఈ విషయాన్ని తక్షణమే పరిశీలించి, ఇటువంటి దుర్వినియోగానికి వ్యతిరేకంగా పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకుంటామ‌ని తెలిపార‌న్నారు. ఇదిలా ఉండ‌గా తండ్రీ కొడుకులు ఇప్పుడు త‌మ త‌మ సినిమాల‌లో బిజీగా ఉన్నారు. ప్ర‌జా రాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ఆ త‌ర్వాత ప‌ద‌వి కోసం కాంగ్రెస్ పార్టీలో క‌లిపేశార‌న్న అపవాదు ఎదుర్కొన్నారు. ప్ర‌స్తుతం అన్ని పార్టీల‌తో ఆయ‌న ట‌చ్ లో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *