Tuesday, 3 November 2026

తెల్లాపూర్‌లో 7 బోర్‌వెల్స్, 6 నీటి సంపులు కూల్చివేత

newsseals-HYDRAA

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో హైడ్రా దూకుడు పెంచింది. అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తోంది. తాజాగా అక్రమ బోర్‌వెల్స్‌పై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా బోర్‌వెల్స్ తవ్వి, భూగర్భ జలాలను కుదిపి, వాటితో వ్యాపారం చేసే వారిపై హైడ్రా ఉక్కు చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉండ‌గా తాజాగా సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రెండు ప్రాంతాల్లో హైడ్రా 7 బోర్‌వెల్స్‌ను వాటి పైపులతో సహా కూల్చివేసి సీల్ చేసింది. అదేవిధంగా 6 నీటి సంపులను ధ్వంసం చేసింది. నీటి ట్యాంకులను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసింది.

భూగర్భ జలాలను పరిరక్షించడంతో పాటు స్థానిక ప్రజలకు నీటి లభ్యతలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు అనుమతులు లేని బోర్‌వెల్స్‌పై హైడ్రా నిశితంగా నిఘా ఉంచుతోంది. భూగర్భ జలాలను తోడేసి, వాటిని ఇష్టానుసారంగా అమ్ముకునే క్రమంలో నీటి ట్యాంకర్లు నిర్లక్ష్యంగా నడపడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. హైడ్రా (HYDRAA) చర్యల వల్ల తమ జీవితాలు ఇప్పుడు సురక్షితంగా ఉన్నాయని పలు కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల నివాసితులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, చెరువులు, బావులు ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న ఈ అక్రమ నీటి దందాను పూర్తిగా అరికట్టాలని చాలామంది విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *