Wednesday, 4 November 2026

హ‌స్తిన‌లో మంత్రి , ఎమ్మెల్యే బిగ్ ఫైట్..?

newsseals-Damodara

ఢిల్లీ : తెలంగాణ‌కు చెందిన ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ‌, జుక్క‌ల్ ఎమ్మెల్యే ల‌క్ష్మీకాంత రావుల మ‌ధ్య ఢిల్లీ వేదిక‌గా బిగ్ ఫైట్ చోటు చేసుకుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఢిల్లీలోని షాంగ్రి-లా హోటల్‌లో ఈ ఇద్ద‌రూ మద్యం మత్తులో ఘర్షణకు దిగిన‌ట్లు టాక్. వీరికి రూములు బుక్ చేసింది జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అని ప్ర‌చారం జ‌రిగింది కూడా. ఈ క్రమంలో వారు ఒకరినొకరు వాగ్వాదానికి దిగ‌డ‌మే కాకుండా, దాడుల‌కు పాల్ప‌డిన‌ట్టు టాక్. హోటల్ లాబీలో మంత్రి దామోదర రాజనర్సింహ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావును ఉద్దేశించి “నిన్ను గదిలో బంధించి చితక బాదుతాను.. నన్నంటే ఏమనుకుంటున్నావు?” అని అంటూ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

వీరిద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగి, చివరకు అది శారీరక దాడికి దారితీసింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని టాక్. ఈ ఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి , ‘సాక్షి’కి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండ‌గా మంత్రి తనను ఇతర ఎమ్మెల్యేల సమక్షంలోనే దూషించి, అవమానించారని పేర్కొంటూ లక్ష్మీకాంతరావు పీసీసీ (PCC)కి ఫిర్యాదు చేశారు. త్వరలోనే కాంగ్రెస్ హైకమాండ్‌కు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్. మ‌రో వైపు రైతులు కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఢిల్లీలో మద్యం తాగుతూ గొడవలకు దిగుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *