Tuesday, 3 November 2026

ముగిసిన టీటీడీ పాల‌క వ‌ర్గం ప‌ద‌వీకాలం

newsseals-TTDBorad

అమ‌రావ‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) పాల‌క వ‌ర్గం కాల ప‌రిమితి ముగిసింది. ఈ క‌మిటీ రెండేళ్ల‌పాటు కొలువు తీరింది. దీంతో చైర్మ‌న్ , స‌భ్యుల ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఏపీ కూట‌మి స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. టీటీడీ చైర్మ‌న్ గా ఉన్న టీవీ5 అధిప‌తి బీఆర్ నాయుడుకు బిగ్ షాక్ ఇచ్చారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న ప‌ద‌వీ కాలం పొడిగిస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. కానీ అందుకు భిన్నంగా దీంతో, కొత్తగా టీటీడీ ఛైర్మన్, సభ్యుల నియామకం పైన పెద్ద ఎత్తున చర్చ జరగ్గా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో ప్రభుత్వం కొత్త కమిటీ ఏర్పాటు పెండింగ్ లో ఉంచింది. దీంతో.. టీటీడీ పాలనా బాధ్యతల కోసం కొత్త కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సీఎం ఆదేశాల మేర‌కు స‌ర్కార్.

ఈ మేర‌కు కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవంబర్ 1న బీఆర్ నాయుడు ఛైర్మన్ గా, సభ్యులతో కమిటీ రెండేళ్ల కాల పరిమితితో నియామకం చేసింది. ప్రస్తుతం ఆ గడువు ముగిసింది. దీంతో టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 658 జారీ చేసింది. ఈ అథారిటీ చైర్మన్‌గా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అలాగే సభ్యులుగా ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, దేవదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటయ్యే వరకు లేదా ఏడాది పాటు ఈ అథారిటీ కొనసాగనుంది. టీటీడీ ధర్మకర్తల మండలికి ఉండే అన్ని అధికారాలు, విధులను దీనికి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *