Tuesday, 3 November 2026

పంట, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి : నిమ్మ‌ల‌

newsseals-NimmalaRamanaiddu

అమ‌రావ‌తి : ఏపీ భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో మురుసు తుపాను ప్ర‌భావం కొన‌సాగుతోంద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. మంగ‌ళ‌వారం మురసు తుఫాన్ నేపధ్యంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ చేప‌ట్టారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, సిఈలు, ఎస్‌ఈలు హాజ‌ర‌య్యారు. మురసు తుఫాన్ ప్రభావంతో పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయ‌ని జాగ్ర‌త్త వ‌హించాల‌ని సూచించారు. ఆయా జిల్లాల్లో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్దాయిలో పరిశీలిస్తూ ఉండాలని మంత్రి నిమ్మల ఆదేశాలు జారీ చేశారు.

రేపల్లే మెయిన్ డ్రైన్, భట్టిప్రోలు మెయిన్ డ్రైన్, గుంటూరు నల్ల డ్రైన్, కొలిమెర్ల, నల్లమడ, పర్చూరు వాగు, రొంపేరు కుడి, ఎడమ, బుడమేరు, లాజబండ డ్రైన్, చంద్రయ్య డ్రైన్ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు నిమ్మ‌ల రామానాయుడు . డ్రైన్లు, కెనాల్స్ లో నీట ప్రవాహం సులువుగా వెళ్ళేలా ఎటువంటి అడ్డంకులు లేకుండా, గుర్రపుడెక్క వంటి వాటిని తొలగించాలని అన్నారు. పంట, ఆస్ధి నష్టం జరుగకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాల‌ని పేర్కొన్నారు. ఇరిగేషన్, రెవిన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలతో నిరంతరం సమన్యయం చేసుకుంటూ పని చేయాలని స్ప‌ష్టం చేశారు నిమ్మ‌ల రామానాయుడు. గుండ్లకమ్మ, బుడమేరు రామవరం వంటి డ్రైన్స్, వాగులు ప్లాష్ తో పొంగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *