హైదరాబాద్‌లో అతిపెద్ద సినిమా స్క్రీన్‌కు రంగం సిద్ధం..?

హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ఏషియన్ సినిమాస్ కలిసి హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఓ భారీ ప్రీమియం సినిమా ప్రాపర్టీని తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో “వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్” ఏర్పాటు చేయడానికి పని చేస్తున్నామని ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ఇప్పటికే వెల్లడించారు. ప్రస్తుతం జర్మనీలోని ట్రౌమ్పాలాస్ట్ లియోన్ బెర్గ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆపరేటింగ్ సినిమా స్క్రీన్‌గా గిన్నిస్ రికార్డు కలిగి ఉంది. దీని వెడల్పు సుమారు 127 అడుగులు, ఎత్తు 69 అడుగులు, విస్తీర్ణం దాదాపు 8,770 చదరపు అడుగులు. 574 రిక్లైనర్ సీట్లతో కూడిన ఈ థియేటర్‌లో ఐమ్యాక్స్ డ్యూయల్ లేజర్ ప్రొజెక్షన్ ఉంది.

అమెరికాలోని జార్జియాలో ఉన్న రాయ‌ల్ సినిమాస్ 14 IMAX మరో భారీ స్క్రీన్‌కు ప్రసిద్ధి చెందింది. దీని కొలతలు సుమారు 101 అడుగుల వెడల్పు × 76.2 అడుగుల ఎత్తు, మొత్తం విస్తీర్ణం దాదాపు 7,696 చదరపు అడుగులు. ఇప్పుడు ఈ రికార్డులను మించే స్థాయిలో హైదరాబాద్‌లో స్క్రీన్‌ను నిర్మించేందుకు ఏషియన్ సినిమాస్–చిరంజీవి టీమ్ ప్లాన్ చేస్తోంది. అయితే కొత్త స్క్రీన్‌కు సంబంధించిన కచ్చితమైన కొలతలు, సీటింగ్ సామర్థ్యం, టెక్నాలజీ వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రీమియం సినిమా అనుభవం కోసం భారీ స్క్రీన్ల పోటీ మొదలైంది.

అయితే చిరంజీవి–ఏషియన్ సినిమాస్ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ పేరు భారత సినిమా మ్యాప్‌లోనే కాదు, ప్రపంచ సినిమా ఎగ్జిబిషన్ మ్యాప్‌లోనూ మరోసారి మార్మోగే అవకాశం ఉంది.

  • Related Posts

    త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ ను ప్ర‌శంసించిన అట్లీ

    చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను ప్రశంసించాడు డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్. ఆయ‌న విజయ్ సేతుపతిపై పరోక్ష విమర్శలు చేశాడు. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘బత్తా’ (Baththa) చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అట్లీ మాట్లాడారు.…

    విజయ్ రాఘవేంద్ర హీరోగా సంజీవ్ మేగోటి మూవీ

    హైదరాబాద్: క్రైమ్, యాక్షన్, థ్రిల్‌తో కూడిన విభిన్న కథలను తెరపై ఆవిష్కరించడంలో తనదైన ముద్ర వేసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *