కూటమి పరాజయం ఖాయం
ఏపీ సీఎం జగన్ రెడ్డి కామెంట్
ఎమ్మిగనూరు – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేపట్టిన బస్సు యాత్ర ఎమ్మిగనూరుకు చేరుకుంది. ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.
అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు గెలిచేది తామేనని ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. వైద్యం, విద్య, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటుకు ప్రయారిటీ ఇవ్వడం జరిగిందన్నారు.
అన్ని రంగాలలో ముందంజలో ఏపీ రాష్ట్రం కొనసాగుతోందని చెప్పారు జగన్ రెడ్డి. నిరాధారమైన ఆరోపణలు చేయడం ప్రతిపక్ష నేతలకు ఒక అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. వాళ్లకు పనీ పాటా లేదన్నారు. తాను 20 గంటలకు పైగా రాష్ట్రం అభివృద్ది కోసం పని చేస్తున్నానని, అయినా ఆరోపణలు చేయడం మానుకోవడం లేదన్నారు జగన్ మోహన్ రెడ్డి.
ప్రజలు కూటమిని ఇంటికి పంపించే పనిలో ఉన్నారని, వారంతా సంక్షేమ పథకాల వైపు చూస్తున్నారని అన్నారు సీఎం.