జగన్ అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు
జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్
మంగళగిరి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో అవినీతి పరాకాష్టకు చేరుకుందని ధ్వజమెత్తారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఆయన మంగళిగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలోని నాలుగన్నర ఏళ్లలో ఏకంగా 8,03,612కు పైగా ఫిర్యాదులు అందాయని ఆరోపించారు.
మంత్రులు, వారి పేషీలపై 2 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై 4.39 లక్షల ఫిర్యాదులు అందాయన్నారు నాదెండ్ల మనోహర్. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన14400 టోల్ ఫ్రీ నంబర్ కి ప్రజలు చేసిన ఫిర్యాదులకు సంబంధించి ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు.
తన పాలనలో అవినీతి లేదని సీఎం సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చు కోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రికి రాష్ట్ర ఏసీబీ డీజీ ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా అవినీతి చోటు చేసుకుందని సంచలన ఆరోపణలు చేశారు నాదెండ్ల మనోహర్. ప్రతిపక్ష పార్టీగా జనసేన పార్టీ కొన్ని ప్రభుత్వ శాఖల్లో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా బయట పెట్టడం జరిగిందన్నారు.