NEWSANDHRA PRADESH

కూట‌మికి ఓట‌మి భ‌యం

Share it with your family & friends

ఎంపీ విజ‌య సాయి రెడ్డి

నెల్లూరు జిల్లా – జ‌గ‌న్ రెడ్డి దెబ్బ‌కు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మికి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని అన్నారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నెల్లూరు జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా వైసీపీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన రోడ్ షోకు భారీ ఎత్తున జ‌నం త‌ర‌లి వ‌చ్చారు.

త‌మ పార్టీ గురించి మాట్లాడే నైతిక హ‌క్కు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కు లేద‌న్నారు విజ‌య సాయి రెడ్డి. అస‌లైన సామాజిక న్యాయం అనేది తాము ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించామ‌ని చెప్పారు. ఇందులో భాగంగానే ఉన్న 175 స్థానాల‌లో 100 సీట్ల‌కు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కు కేటాయించ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు విజ‌య సాయి రెడ్డి.

కేవ‌లం త‌న సామాజిక వ‌ర్గానికి మాత్ర‌మే ల‌బ్ది చేకూరాల‌న్న ఆలోచ‌న మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. పేద‌లు రాజ‌కీయంగా ఎదుగుతుంటే ఎందుకు ఇంత మంట అని ప్ర‌శ్నించారు ఎంపీ. మూడు పార్టీలు కాదు క‌దా ఇంకెన్ని పార్టీలు వ‌చ్చినా , ఏక‌మైనా వైసీపీని ఏపీలో ఓడించ లేవ‌ని జోష్యం చెప్పారు. ఇక‌నైనా క‌ల‌లు క‌న‌డం మానేయాల‌ని సూచించారు చంద్ర‌బాబు నాయుడుకు.