బెంగళూరుకు కోల్ కతా షాక్
7 వికెట్ల తేడాతో ఘన విజయం
బెంగళూరు – ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ దుమ్ము రేపింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ కీలక పోరులో పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది.
తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 182 రన్స్ చేసింది. కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ మోములో సంతోషం వ్యక్తమైంది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించినా, చివరి దాకా నిలిచినా ఫలితం లేక పోయింది. రన్ మెషీన్ 59 బంతులు ఎదుర్కొని నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి.
భారీ లక్ష్యాన్ని ఇంకా 19 బాల్స్ ఉండగానే పని పూర్తి చేసింది కోల్ కతా నైట్ రైడర్స్. ఈ జట్టులో వెంకటేశ్ అయ్యర్ 30 బంతులు ఎదుర్కొని 3 పోర్లు 4 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 50 రన్స్ చేశాడు. సునీల్ సెరైన్ దుమ్ము రేపాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
22 బాల్స్ ఎదుర్కొని 47 రన్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇక శ్రేయస్ అయ్యర్ పని కానిచ్చేశాడు. 24 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్సర్లతో 39 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కోల్ కతా గెలుపులో కీలక పాత్ర పోషించిన సునీల్ సరైన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.