హఫీజ్ ఖాన్ కు బంపర్ ఆఫర్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
ఎమ్మిగనూరు – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన యాత్రకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా అడుగడుగునా సాదర స్వాగతం లభించింది. కర్నూలు జిల్లాకు సంబంధించి తాను ఎమ్మెల్యేగా సీనియర్ నాయకుడు, తనకు సోదర సమానుడైన హఫీజ్ ఖాన్ కు టికెట్ ఇవ్వలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా తాను బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించారు సీఎం.
ఈ మేరకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వక పోవడం బాధ పడుతున్నానని, కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ ఇవ్వలేదన్నారు జగన్ రెడ్డి. ఎన్నికలు అయి పోయిన వెంటనే హఫీజ్ ఖాన్ కు బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు రాజ్య సభ సీటు కేటాయిస్తానని, తన వాయిస్ ను పార్లమెంట్ లో వినిపించాలని సూచించారు.
ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు హఫీజ్ ఖాన్. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడి పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి. ఈసారి ఎన్నికల్లో కూటమికి ఓటమి తప్పదన్నారు సీఎం. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.