DEVOTIONAL

తిరుమ‌ల భ‌క్తుల‌తో క‌ళ‌క‌ళ

Share it with your family & friends

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.41 కోట్లు

తిరుమ‌ల – ప్ర‌సిద్ధ పుణ్య క్షేత్రం తిరుమ‌ల భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. ఎక్క‌డ చూసినా స్వామి వారిని ద‌ర్శించు కునేందుకు భ‌క్త బాంధ‌వులు బారులు తీరారు. గోవిందా గోవిందా , ఆప‌ద మొక్కుల వాడా గోవిందా, అనాధ రక్ష‌క గోవిందా, అదివో అల్ల‌దివో శ్రీ‌హ‌రి వాస‌ము, ప‌ది వేల శేషుల ప‌డ‌గ‌ల మ‌యం, విన‌రో భాగ్య‌ము వింత క‌థా అంటూ శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను స్మ‌రించుకుంటూ ముందుకు సాగుతున్నారు భ‌క్తులు.

భ‌క్తుల తాకిడి పెరిగింది. రోజు రోజుకు పెరుగుతున్నారే త‌ప్పా త‌గ్గ‌డం లేదు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వ‌స‌తి సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టింది. టీటీడీ సీబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. నిన్న శ్రీవారిని 60 వేల 958 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.

31 వేల 245 మంది భ‌క్తులు స్వామి వారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించార‌ని టీటీడీ వెల్ల‌డించింది. భ‌క్తులు నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 341 కోట్లు వ‌చ్చిన‌ట్లు తెలిపింది. సేవా స‌ద‌న్ వ‌ర‌కు భ‌క్తులు వేచి ఉన్నారని, .స‌ర్వ ద‌ర్శ‌నం కోసం ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు క‌నీసం 24 గంట‌ల‌కు పైగా ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని టీటీడీ ఈవో ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు.