తప్పైంది మన్నించండి – వస్త్రాకర్
అభ్యంతరకర పోస్ట్ పై కామెంట్
ముంబై – ప్రముఖ మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ చర్చనీయాంశంగా మారారు. ఆమె గత కొన్ని రోజుల నుండి ట్రోల్ కు గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం తన ఇన్ స్టా ఖాతా నుండి అభ్యంతకరమైన చిత్రాన్ని పోస్ట్ చేయడం. పెద్ద ఎత్తున నిరసన , ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో ఓ మహిళా క్రికెటర్ గా ఇలాంటి పోస్ట్ ఎలా చేసిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఈ ఫోటోలో ప్రధానంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ చంద్ర షా, ఎస్ జై శంకర్ , స్మృతీ ఇరానీ , తదితరులను అవహేళన చేస్తూ అభ్యంతకరంగా ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో గత్యంతరం లేక స్పందించింది పూజా వస్త్రాకర్.
తాను కావాలని పోస్ట్ చేయలేదని స్పష్టం చేసింది. ఆ పోస్ట్ చేసిన సమయంలో తన వద్ద ఫోన్ లేదని పేర్కొంది. ఎవరినైనా నొప్పించి ఉంటే తనను మన్నించాలని కోరింది. తెలియక జరిగిన తప్పును సహృదయతతో అర్థం చేసుకోవాలని కోరింది పూజా వస్త్రాకర్.