NEWSANDHRA PRADESH

వైసీపీ స‌ర్కార్ బేకార్ – బాబు

Share it with your family & friends

అవినీతికి ఏపీ కేరాఫ్

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌జా గ‌ళం స‌భ‌లో ప్ర‌సంగించారు. సింగ‌న‌మ‌ల శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఎమ్మెల్యే అవినీతి గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

ఆయ‌న అవినీతి అన‌కొండ‌ను మించి పోయిందంటూ మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టి కోట్లు కొల్ల‌గొట్టిన వారిపై ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు. తమ కూట‌మి ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని ఇక ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌మ‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రి పేరు తాము డైరీలో రాసుకుంటున్నామ‌ని , జ‌గ‌న్ రెడ్డికి, ఆయ‌న ప‌రివారానికి స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రినీ గుర్తు పెట్టుకుంటామ‌న్నారు.

సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే ద‌గ్గ‌ర ప‌ని చేసే డ్రైవ‌ర్ కు నువ్వు సీటు ఇచ్చిన విష‌యం ప్ర‌జ‌ల‌కు తెలియ‌ద‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లేన‌ని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చిన ఘ‌న‌త నీది కాదా జ‌గ‌న్ అంటూ ప్ర‌శ్నించారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇక నీ ప‌నై పోయింద‌ని, ఇంటికి వెళ్ల‌డ‌మే మిగిలి ఉంద‌న్నారు.