వాలంటీర్ల విధులపై ఈసీ ఆంక్షలు
ఏపీ జగన్ రెడ్డి సర్కార్ కు బిగ్ షాక్
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. తాను తీసుకు వచ్చిన వాలంటీర్ వ్యవస్థపై కీలక వాక్యలు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆదివారం ఈ మేరకు ఏపీలో వాలంటర్లీ జవాబుదారీ తనం లేక పోవడంతో, అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వచ్చాయని ఈసీ స్పష్టం చేసింది.
ఈ మేరకు వాలంటీర్ల పై వస్తున్న ఫిర్యాదుల పై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు విధులు నిర్వహించడంపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయవద్దని ఆదేశించింది.
ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించింది. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, అవసరమైతే నగదు బ్యాంకుల ద్వారా బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
తమ ఆర్డర్ ను పక్కన పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది కేంద్ర ఎన్నికల సంఘం.