NEWSANDHRA PRADESH

దేశంలో బీజేపీ రాజ్యాంగం న‌డుస్తోంది

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఏపీ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌

అమ‌రావ‌తి – ఈ దేశంలో డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం న‌డ‌వ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌. కేవ‌లం మోదీ రాచ‌రికంతో కూడిన పాల‌న కొన‌సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.

ప్ర‌స్తుతం బీజేపీ రాజ్యాంగం కొన‌సాగుతోంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీని చూసి బీజేపీ భ‌య‌ప‌డుతోంద‌ని ఎద్దేవా చేశారు. ప‌నిగ‌ట్టుకుని త‌ను మాత్ర‌మే ఈ దేశంలో ఉండాల‌ని అనుకుంటోంద‌ని మండిప‌డ్డారు వైఎస్ ష‌ర్మిల‌. కులం పేరుతో, మ‌తం పేరుతో విభేదాలు సృష్టించి ఓట్లు దండు కోవాల‌ని చూస్తోంద‌న్నారు .

ప్ర‌స్తుతం సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రోజు రోజుకు కాంగ్రెస్ పార్ట‌తీతో కూడిన ఇండియా కూట‌మికి జ‌నాద‌ర‌ణ పెరుగుతోంద‌ని, దీంతో ఓడి పోతామోన‌న్న ఆందోళ‌న మోదీలో కొన‌సాగుతోంద‌న్నారు. అందుకే ఆయ‌న ప్ర‌తిప‌క్షాల‌ను లేకుండా చేయాల‌ని అనుకుంటున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు వైఎస్ ష‌ర్మిల‌. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థ‌ల‌ను ఉసిగొల్పుతున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఎల‌క్టోర‌ల్ బాండ్ల ద్వారా అత్య‌ధికంగా లాభ ప‌డిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపేన‌ని పేర్కొన్నారు. ముందుకు దానికి మోదీ స‌మాధానం చెప్పాల‌ని వైఎస్ ష‌ర్మిల డిమాండ్ చేశారు.