ఓటేయండి బీజేపీని ఓడించండి
పిలుపునిచ్చిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్
న్యూఢిల్లీ – ఈ దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ . ఆదివారం భారతీయ కూటమి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా రాం లీలా మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగను ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ ప్రసంగించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాచరిక పాలన సాగిస్తున్నారని, తాను మాత్రమే నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నారని కానీ ఈ దేశంలో అది కొనసాగదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ విలువైన ఓటును భారత కూటమి అభ్యర్థులకు వేయాలని కోరారు. లేకపోతే రాచరిక వ్యవస్థ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మోదీ పదే పదే 400 సీట్లు గెలుస్తామని అంటున్నాడని, ఏం చేశాడని, ఏం ఉద్దరించాడని ఆయనకు అన్ని సీట్లు వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం కులం పేరుతో, మతం పేరుతో ఓట్లు సంపాదించాలని కలలు కంటున్నారని ఇది ఎన్నటికీ జరగదన్నారు అఖిలేష్ యాదవ్.