జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాలి

రాష్ట్ర బిజేపి అధ్యక్షుడికి జ‌ర్న‌లిస్టుల విన‌తి

హైదరాబాద్ : రాష్ట్రాల, కేంద్ర పాలిత జర్నలిస్టులకు జాతీయ స్థాయిలో పెన్షన్ పథకం అమలు
చేయాలని సీనియర్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆనందం మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాలు మాత్రమే జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో ఈవిధానం అమలుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు మీ ద్వారా సిఫారసు చేయాలని కోరారు.

సీనియర్ పాత్రికేయులకు, జాతీయ వెల్ఫేర్ ఫండ్, పెన్షన్, మీడియా కమిషన్ జాతీయ స్థాయిలో రిటైర్ సీనియర్ జడ్జితో ఏర్పాటు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు జాతీయ భద్రత కల్పించాలని వారు విన్నవించారు. ఈకార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి, రత్న చోటి రాణి
తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు

    హైద‌రాబాద్ : తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండించారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సాక్షిలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నాన‌ని పేర్కొన్నారు. నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడ లేద‌న్నారు. త‌నపై ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజా ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని…

    నామినేటెడ్ పదవులు త్వరలో భర్తీ చేస్తాం

    హైద‌రాబాద్ : టీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని వెల్ల‌డించారు. కేవ‌లం గ‌త కొంత కాలం నుంచి పార్టీ కోసం నిస్వార్థంగా, నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేసిన పార్టీకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *