పెన్షన్ల నిలుపుదల ఆ ముగ్గురిదే
మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్
తాడేపల్లి గూడెం – రాష్ట్రంలో పెన్షన్ల నిలుపుదలకు ప్రధాన కారకులు ఆ ముగ్గురేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని (వెంకట్రామయ్య). చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ లపై నిప్పులు చెరిగారు. నీచ రాజకీయాలకు పేదలు బలయ్యారంటూ ఆరోపించారు.
వాలంటీర్లంటే ఆ ముగ్గురికి భయం పట్టుకుందన్నారు. కూటమి కుట్రలను తిప్పి కొట్టాలని, వైసీపీకి పట్టం కట్టాలని పేర్ని నాని పిలుపునిచ్చారు. ఎన్నికల వ్యవస్థను ఈనాడు రామోజీ రావు నడిపిస్తున్నాడా అని మండిపడ్డారు. ఎన్నికల అధికారులపై ఎవరు వత్తిళ్లు చేస్తున్నారో తేలాల్సిన అవసరం ఉందన్నారు.
ఆ ముగ్గురు పెత్తందారులంటూ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నిజం చేశారంటూ స్పష్టం చేశారు. భీమవరంలో చెప్పిన మాట నిలుపు కోలేకనే పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చాడా అని ప్రశ్నించారు పేర్ని నాని.
ఎంత మంది కూటమి కట్టినా ప్రజల్లో జగన్ గారి పట్ల ప్రేమను చెరపడం మీ తరం కాదన్నారు మాజీ మంత్రి. పేదల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఆ ముగ్గురి కారణంగా ఆగి పోవడం బాధాకరమన్నారు.