అభినందించిన ఎంపీ రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : సీబీఎస్ఈ – ఓఎస్ఎం లోని లోపాలను బయట పెట్టాడు ధైర్యంగా 18 ఏళ్ల సార్థక్ . ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు. తనపై ప్రశంసలు కురిపించాడు రాహుల్ గాంధీ. దీనిని ప్రభుత్వంపై యువత సాధించిన విజయంగా అభివర్ణించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యువత కేవలం “రీల్స్” చేయడంలో నిమగ్నమై, ప్రశ్నలు అడగకుండా ఉండాలని కోరుకుంటారని, కానీ ఈ విద్యార్థులు వ్యవస్థను సవాలు చేసి సమాధానాలను కనుగొన్నారని గాంధీ పేర్కొన్నారు.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ , సర్వీస్ ప్రొవైడర్ మధ్య ఉన్నట్లు ఆరోపించ బడుతున్న కుమ్మక్కును బయట పెట్టినందుకు సార్థక్ ను, తన సహచరుడు నిసర్గలను ప్రశంసించారు.
వారి కృషిని యువత విజయంగా , ప్రభుత్వానికి ఓటమిగా ఆయన అభివర్ణించారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలలో ఉపయోగించే ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలోని లోపాలపై ఆందోళన వ్యక్తం చేసిన సార్థక్, ప్రధాన మీడియా సంస్థలు, పరిశోధనాత్మక జర్నలిస్టులు వెలికి తీయడంలో విఫలమైన అంశాలను వెలుగులోకి తీసుకు రాగలిగారు. దేశంలోని పెద్ద మీడియా సంస్థలు, పరిశోధనాత్మక జర్నలిస్టులు చేయలేని పనిని వీరు చేయగలగడం మామూలు విషయం కాదన్నారు రాహుల్ గాంధీ. మోదీ మన యువత కేవలం రీల్స్ చేస్తూ, పకోడీలు వేస్తూ, ప్రశ్నలు అడగకుండా, కళ్లు తెరవకుండా ఉండాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.





