ఇక జగన్ చాప్టర్ క్లోజ్
టీడీపీలోకి భారీగా వలసలు
అమరావతి – రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తూ వచ్చిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మూడిందన్నారు టీడీపీ సీనియర్ నాయకుడు కొల్లు రవీంద్ర. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించడం ఖాయమని జోష్యం చెప్పారు .
రాష్ట్ర పునర్ నిర్మాణం జరగాలంటే కూటమి గెలవాల్సిందేనని, మీ విలువైన ఓటును జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. మెరుగైన పాలన, సమర్థవంతమైన నాయకత్వం కేవలం తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమవుతుందన్నారు కొల్లు రవీంద్ర.
విజన్ ఉన్న ఏకైక నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమేనని స్పష్టం చేశారు. పొట్టపాలెంకు చెందిన పలువురు నాయకులు తమ పార్టీలో చేరడాన్ని తాను స్వాగతిస్తున్నానని, భవిష్యత్తులో మంచి గుర్తింపు తప్పక ఉంటుందన్నారు కొల్లు రవీంద్ర. ఇక తమకు 175 సీట్లకు గాను 150కి పైగానే వస్తాయన్నారు. ఇక ఎంపీ సీట్లకు సంబంధించి చూస్తే కనీసం 20కి పైగానే వస్తాయన్నారు.