జగన్ పరిశ్రమల ఊసేది..?
నారా లోకేష్ సీరియస్ కామెంట్స్
మంగళగిరి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని కేవలం 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశాడంటూ నిప్పులు చెరిగారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలను తీసుకు వచ్చారో ప్రజలకు లెక్క చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో ఐటీ రంగానికి ప్రయారిటీ ఇచ్చామని, పరిశ్రమలకు పెద్దపీట వేశామని అన్నారు. కానీ జగన్ రెడ్డి వచ్చాక పారిశ్రామికవేత్తలు జడుసుకునే పరిస్థితికి తీసుకు వచ్చేలా చేశాడని మండిపడ్డారు.
అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని, ఎవరైనా పెట్టుబడి పెట్టాలని వస్తే వారిని భయభ్రాంతులకు గురి చేశాడని ఆరోపించారు. దీంతో ఉన్న కంపెనీలను మూసి వేసుకునే పరిస్థితికి తీసుకు వచ్చేలా చేశాడంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నారా లోకేష్ బాబు.