DEVOTIONAL

తిరుమ‌ల క్షేత్రం భ‌క్త సందోహం

Share it with your family & friends

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ.4.34 కోట్లు

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. ప్ర‌తి ఏటా టీటీడీ ఆధ్వ‌ర్యంలో ర‌థ స‌ప్త‌మి నిర్వ‌హించ‌డం ఆనవాయితీగా వ‌స్తోంది. అస‌లే ప‌రీక్ష‌లు ముగియ‌డం, ఆదివారం కావ‌డంతో భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. ఎక్క‌డ చూసినా భ‌క్తులే క‌నిపించారు.

ఇదిలా ఉండ‌గా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మల‌ను ద‌ర్శించు కునేందుకు పెద్ద ఎత్తున పోటీ ప‌డ్డారు. నిన్న ఒక్క రోజే ఏకంగా 81 వేల 224 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 24 వేల 93 మంది భ‌క్తులు త‌ల నీలాలు స‌మ‌ర్పించుకున్నారు.

భ‌క్తులు నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.35 కోట్లు వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి కార్య నిర్వ‌హ‌ణ అధికారి ఏవీ ధ‌ర్మా రెడ్డి. ప్ర‌స్తుతం 21 కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నారని తెలిపారు. ఇక ఎలాంటి టికెట్లు లేకుండా ధ‌ర్మ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు క‌నీసం 24 గంట‌ల‌కు పైగా ప‌డుతుంద‌ని పేర్కొన్నారు.