శివకుమార జీవితం చిరస్మరణీయం
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ , చీఫ్ ఖర్గే
న్యూఢిల్లీ – కన్నడ నాట కోట్లాది మందికి ఆరాధ్యనీయమైన వ్యక్తిగా నిలిచి పోయారు శ్రీ శివకుమార స్వామీజీ. ఆశ్రమాలు, విద్యాలయాలను ఆయన స్థాపించారు. మానవాత్వాన్ని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. జీవితం విలువైనదని, దానిని పరుల క్షేమం కోసం, సమాజ హితం కోసం పని చేయాలని బోధించారు. ఆయన ఆధ్యాత్మిక గురువుగా, మానవత్వం పరిమళించే మహానుభావుడిగా కన్నడవాసులు కొలుస్తారు.
ఎందరికో స్పూర్తి కలిగిస్తూ తన జీవితాన్ని పరుల కోసం చివరి క్షణం దాకా అంకితం చేసి తనువు చాలించిన మహా యోగి శ్రీ శివకుమార స్వామీజీ జయంతి ఇవాళ. ఈ సందర్బంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ, సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాళులు అర్పించారు.
కులం తెలియని జ్ఞాని అని, ఆయన చేసిన బోధనలు నేటికీ ఎల్లప్పటికీ గుర్తుండి పోతాయని పేర్కొన్నారు. మతం అంటే మనుషుల మధ్య భేదాలను సృష్టించడం కాదని అది కేవలం మనుషులను కలిపే సాధనమని చెప్పిన శివకుమార జీవితం చిరస్మరణీయని పేర్కొన్నారు.