బోణీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్
చెన్నైపై 20 రన్స్ తేడాతో గెలుపు
విశాఖపట్టణం – ఐపీఎల్ 2024లో భాగంగా వైజాగ్ వేదికగా జరిగిన కీలక లీగ్ పోరులో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఎలెవన్ కు షాక్ ఇచ్చింది. 20 పరుగుల తేడాతో గెలుపొందింది. వైఎస్సార్ స్టేడియంలో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగింది.
వరుసగా రెండు మ్యాచ్ లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడి పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ దుమ్ము రేపింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎప్పటి లాగే స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ దుమ్ము రేపాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. వరుస మ్యాచ్ లలో ఫెయిలైన కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో అర్ధ శతకంతో రాణించాడు. 51 పరుగులు చేశాడు.
అనంతరం 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఛేదనలో చతికిల పడింది. ఆశించిన మేర రాణించ లేక పోయారు. దీంతో 6 వికెట్లు కోల్పోయి 171 రన్స్ మాత్రమే చేశారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 16 బంతులు ఎదుర్కొని 37 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇక రహానే సూపర్ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేక పోయింది.