కేసీఆర్ పాలనలోనే అభివృద్ది
స్పష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభివృద్దికి నమూనా కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు. ఈ దేశంలో విజనరీ కలిగిన ఏకైక నాయకుడు బీఆర్ఎస్ బాస్ అని స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ది సాధించిందని పేర్కొన్నారు. కానీ కొందరు అమాయకులు, అసమర్థులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కొన్ని పనిగట్టుకుని ఛానెళ్లు తమకు వ్యతిరేకంగా ప్రసారం చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవాళ దేశంలోనే రూ. 3.09 లక్షల తలసరి ఆదాయంతో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని, దీనికి ప్రధాన కారకుడు ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని కుండ బద్దలు కొట్టారు మాజీ మంత్రి కేటీఆర్. లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని, కళ్ల ముందు ఉన్న అభివృద్దిని చూస్తే బాగుంటుందని సూచించారు కేటీఆర్.