NEWSNATIONAL

ప్ర‌ధాని మోదీ భావోద్వేగం

Share it with your family & friends

దివంగ‌త జ‌య‌ల‌లిత గ్రేట్ లీడ‌ర్

న్యూఢిల్లీ – ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ భావోద్వేగానికి లోన‌య్యారు. ఆయ‌న ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఓ జాతీయ మీడియా ఛానెల్ తో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఏఐఎండీకేపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మిళ‌నాడు మాజీ సీఎం, దివంగ‌త జ‌య‌ల‌లిత‌తో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఆమె ఎల్ల‌ప్పుడూ రాష్ట్రం గురించి, ప్ర‌జ‌ల గురించి ఆలోచించేద‌ని పేర్కొన్నారు పీఎం.

ఇవాళ జ‌య‌ల‌లిత భౌతికంగా లేక పోయినా ఎల్ల‌ప్ప‌టికీ త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌లో చిర‌స్మ‌ర‌ణీయురాలిగా గుర్తుండి పోతుంద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు మోదీ. 2002లో చోటు చేసుకున్న అల్ల‌ర్ల పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల గురించి కూడా పీఎం ప్ర‌స్తావించారు.

బీజేపీతో విడి పోయినందుకు ఏఐఏడీఎంకే ప‌శ్చాత ప‌డాల‌న్నారు. జ‌య‌ల‌లిత క‌ల‌ల‌ను వ‌మ్ము చేసింద‌ని ఆరోపించారు. ఒక‌వేళ ఆమె ఆశ‌యాల‌ను కొన‌సాగిస్తూ వ‌చ్చి ఉంటే ఇప్పుడు ప‌రిస్థితి వేరే లాగా ఉండేద‌న్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ, ఏఐఏడీఎంకే కూట‌మి విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.