జొజిల్లా ట‌న్నెల్ తో అమర్‌నాథ్ యాత్రకు ఓకే

క్లిష్ట భౌగోళిక పరిస్థితులు ప్ర‌త్యేకం

జ‌మ్మూ కాశ్మీర్ : జోజిలా లో నిర్మిస్తున్న 13 కిలోమీటర్ల ప్రధాన టన్నెల్ మార్గంలో రాతి నిర్మాణాల స్వభావం 67 సార్లు మారింది. మంచు నుంచి అత్యంత బలహీనమైన రాతి పొరల వరకు మారుతూ వచ్చిన ఈ సవాళ్లను నిపుణులైన ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బంది విజయవంతంగా అధిగమించారు. టన్నెల్ పూర్తి చేశారు. టన్నెల్ నిర్మాణ ప్రాంతంలో 1,100 మందికి పైగా నివసించేలా పూర్తి సౌకర్యాలతో కూడిన ఆధునిక బేస్ క్యాంప్ ను ఎం ఈ ఐ ఎల్ ఏర్పాటు చేసింది. స్థానిక వాతావరణానికి అనుగుణమైన ఆహారం, వైద్య సేవలు, రవాణా, ఇతర సౌకర్యాలు ఈ క్యాంపులో అందుబాటులో ఉన్నాయి. వందలాది ట్రక్కులు, డజన్ల కొద్దీ లోడర్లు, ఎక్స్‌కవేటర్లు, బ్యాచింగ్ ప్లాంట్లు, క్రషింగ్ యూనిట్లు, ఆధునిక డ్రిల్లింగ్ బూమర్లు టన్నెల్ కోసం వినియోగిస్తున్నారు.

ఏన్ హెచ్ ఐ డి సి ఎల్ (NHIDCL) సమన్వయంతో ప్రతి సంవత్సరం నిర్వహించే అమర్‌నాథ్ యాత్రకు టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణ బృందం విశేష సహకారం అందిస్తోంది. యాత్రికుల కోసం పార్కింగ్ సదుపాయాలు, మొబైల్ మరుగుదొడ్లు, బేస్ హాస్పిటల్‌కు అవసరమైన ఫ్లోరింగ్ ఏర్పాట్లు వంటి సేవలను అందిస్తూ యాత్ర సజావుగా సాగేందుకు కృషి చేస్తోంది. జోజిలా ప్రాజెక్ట్ మొత్తం పొడవు రోడ్లు, వంతెనలతో కలిపి 30.894 కి.మీ. ఇందులో జోజిలా ప్రధాన టన్నెల్ పొడవు 13.153 కి.మీ. నిల్‌గ్రార్ టన్నెల్ T1 పొడవు 457.35 మీటర్లు. నిల్‌గ్రార్ టన్నెల్ T2 పొడవు 1,953.63 మీటర్లు (సుమారు రెండు కిలోమీటర్లు)

ఈ ప్రాజెక్టులో ఉన్న మూడు వంతెనల పొడవు 460 మీటర్లు. భారతదేశంలోనే అత్యంత పొడవైన వెర్టికల్ షాఫ్ట్ ఇక్కడ నిర్మించారు. వెర్టికల్ షాఫ్ట్-1 (పశ్చిమ) పొడవు 474.30 మీటర్లు. దీని ఎత్తు 3481 మీటర్లు. మధ్యలో నిర్మించిన వెర్టికల్ షాఫ్ట్-2 పొడవు 367.38 మీటర్లు. తూర్పు వైపున నిర్మించిన వెర్టికల్ షాఫ్ట్-3పొడవు 213.50 మీటర్లు. మొత్తం 2,350 మీటర్ల కట్-అండ్-కవర్ నిర్మాణాలు 7 ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో 450 మీటర్లు స్నో గ్యాలరీ కూడా ఉంది.

జోజిలా ప్రాజెక్ట్ లో ప్రధాన టన్నెల్ బ్రేక్ త్రూ మంగళవారం జూన్ తొమ్మిదన జరగనుంది. ఇందులో కీలకమైన నిల్‌గ్రార్ టన్నెల్ T1 ట్యూబ్-1 బ్రేక్ త్రూ 2021 నవంబర్ 4న, ట్యూబ్ 2 బ్రేక్ త్రూ నవంబర్ 22న, నిల్‌గ్రార్ టన్నెల్ T2 ట్యూబ్-1 బ్రేక్ త్రూ 2022 మార్చి ఎనిమిదిన, నిల్‌గ్రార్ టన్నెల్ T2 ట్యూబ్-2 బ్రేక్ త్రూ 2022 ఏప్రిల్ 21న జరిగింది. టన్నెల్ లోని షాఫ్ట్-3 బ్రేక్ త్రూ 2023 నవంబర్ 15న, షాఫ్ట్ 1 బ్రేక్ త్రూ గత ఏడాది జులై 28న జరిగింది . టన్నెల్‌లో ప్రత్యేక ఎస్కేప్ టన్నెల్ లేడు. అందువల్ల ఈ వెర్టికల్ షాఫ్ట్‌లు గాలి ప్రసరణ, అత్యవసర భద్రతా అవసరాలకు కీలకంగా ఉపయోగ పడతాయి.

  • Related Posts

    శ్రీ పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

    తిరుప‌తి : తిరుపతి జిల్లా సురుటుపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ పద్మనాభరాజు, కార్యనిర్వహణాధికారి…

    కళల పరిరక్షణకు టీటీడీ నిరంతర ప్రోత్సాహం

    తిరుప‌తి : తిరుపతి ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా భారతీయ కళలు, సంస్కృతికి నిలయమని, కళలను పరిరక్షించి ప్రోత్సహించే ప్రతి సంస్థకు టీటీడీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను అని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలోని మహతి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *