మెరిసిన గిల్..మిల్లర్
గుజరాత్ టైటాన్స్ విక్టరీ
గుజరాత్ – నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ కీలక లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. మిల్లర్ , శుభ్ మన్ గిల్ అద్భుతంగా రాణించారు. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశించిన మేర రాణించ లేక పోయింది. ఐపీఎల్ లోనే భారీ స్కోర్ రికార్డు నమోదు చేసిన ఎస్ ఆర్ హెచ్ ఈ మ్యాచ్ లో తేలి పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 162 రన్స్ మాత్రమే చేసింది.
అనంతరం 163 లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆడుతూ పాడుతూ ఛేదించింది . కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ 19.1 ఓవర్లలో పూర్తి చేసింది. మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడితే శుభ్ మన్ గిల్ బాధ్యతా యుతమైన పరుగులు చేశాడు.
మిల్లర్ 27 బాల్స్ మాత్రమే ఎదుర్కొని 44 రన్స్ చేశాడు. సాయి సుదర్శన్ 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక కెప్టెన్ గిల్ 36 రన్స్ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక ఓపెనర్ సాహా 25 రన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఐపీఎల్ లో హైదరాబాద్ ఓడి పోవడం ఇది రెండో మ్యాచ్ కావడం విశేషం.