యుద్దానికి సిద్దం గెలుపు తథ్యం
ఎంపీ విజయ సాయి రెడ్డి
నెల్లూరు జిల్లా – ఏపీలో మరోసారి వైసీపీ సత్తా చాటడం ఖాయమని జోష్యం చెప్పారు సిట్టింగ్ ఎంపీ విజయ సాయి రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా ఎంపీ ప్రసంగించారు. యుద్ధానికి తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇవాళ అత్యధికంగా కోట్లాది మంది లబ్ది పొందారని చెప్పారు.
వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదేనని మండిపడ్డారు. ఇవాళ ఏం ముఖం పెట్టుకుని , ఏం ఉద్దరించారని ఓట్లు అడుగుతున్నారంటూ నిలదీశారు విజయ సాయి రెడ్డి. టీడీపీ కూటమి ఓడి పోవడం పక్కా అని పేర్కొన్నారు. తమ అధినేత చెప్పినట్లు వై నాట్ 175 అన్నది ఆచరణలో చేసి చూపిస్తామని చెప్పారు.
తమ పార్టీ చేపట్టిన యుద్దానికి సిద్దం కార్యక్రమానికి భారీ ఎత్తున ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు ఎంపీ విజయ సాయి రెడ్డి. తమ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోష్యం చెప్పారు.