కడప నుంచి షర్మిల పోటీ
తండ్రికి నివాళులు అర్పించిన కూతురు
కడప జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. తాను త్వరలో రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉంటానని ప్రకటించారు. ఆమె చేసిన ప్రకటన రాజకీయ వర్గాలలో కలకలం రేపింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే శాసన సభ, పార్లమెంట్ ఎన్నికలకు గాను ఏఐసీసీ హైకమాండ్ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
ఈ సందర్బంగా వైఎస్ షర్మిల ఇడుపులపాయ లోని దివంగత నాయకుడు, సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఆమెతో పాటు సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఏపీ పీసీసీ చీఫ్ లు హాజరయ్యారు.
నా రాజకీయ సుదీర్ఘ లక్ష్యాన్ని చేరుకోవాలని తన తల్లి వైఎస్ విజయమ్మ నిండు మనసుతో ఆశీర్వదించారని అన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తరపున తాను కడప ఎంపీ గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్ సుదీర్గ కల నెరవేరిందన్నారు.
ఆయన ఆశయాల సాధన కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు వైఎస్ షర్మిల. వైఎస్సార్ బతికి ఉంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల.