ఇఫ్తార్ విందులో షర్మిల
రంజాన్ పండుగ శుభాకాంక్షలు
కడప – పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం అన్నారు. ప్రతి ఒక్కరు సోదర భావంతో మెలగాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో కడపలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికారు ముస్లిం సోదరులు.
తమ పార్టీ ఎల్లప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తూ వస్తుందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. తన తండ్రి దివంగత రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లిం సోదర సోదరీమణులకు ఎంతగానో సహాయ పడ్డారని గుర్తు చేశారు. ఇవాళ తాను పార్టీ చీఫ్ గా ఇఫ్తార్ విందులో పాల్గొనడం అత్యంత సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఉపవాస దీక్షలను నిష్టగా ఆచరిస్తున్న సోదర సోదరీమణులకు ప్రత్యేకంగా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియ చేస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరికీ తాము అండగా ఉంటామని ప్రకటించారు వైఎస్ షర్మిలా రెడ్డి.