చంద్రబాబు నీతులు వల్లిస్తే ఎలా..?
ఎంపీ విజయ సాయి రెడ్డి విసుర్లు
నెల్లూరు జిల్లా – అబద్దాలు చెప్పడంలో దేశంలోనే నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు అంటూ ఎద్దేవా చేశారు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ ఆయనేనంటూ మండిపడ్డారు. వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో చంద్రబాబును మించిన నాయకుడు ఈ దేశంలోనే లేరన్నారు.
బాబుది నాలుక కాదు తాటి మట్ట అంటూ ప్రజలు ఏనాడో తేల్చేశారంటూ ధ్వజమెత్తారు విజయ సాయి రెడ్డి. 22 కేసుల్లో స్టే తెచ్చుకున్న బాబుకు జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. వ్యవస్థలను సర్వ నాశనం చేసింది నువ్వు కాదా అంటూ బాబును నిగ్గదీసి ప్రశ్నించారు ఎంపీ.
5 కేసులలో ప్రధాన నిందితుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. స్కిల్ స్కామ్ కేసులో 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో చిప్పకూడు తిన్నా ఇంకా బుద్ది రాలేదని మండిపడ్డారు. మీడియాతో పాటు ప్రస్తుత వ్యవస్థలో బాబు నాటిన విత్తనాలు వృక్షాలై గొడుగు పడుతున్నాయంటూ ఆరోపించారు. లేకపోతే కనీసం చంద్రబాబు 30 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి ఉండేవాడని అన్నారు విజయ సాయి రెడ్డి.