బహుజన యుద్ధ నౌక సోమన్న
కితాబు ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సోమన్న బహుజనుల కోసం, పీడితుల, తాడితుల, బహుజన , మైనార్టీల వర్గాల కోసం, వారి తరపున తను గొంతుకై ఉన్నాడని కితాబు ఇచ్చారు. ఇలాంటి కవులు, గాయకులు , రచయితలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవాళ కేవలం ఒకే సామాజిక వర్గానికే పదవులు దక్కుతున్నాయని, మా కోటా మా వాటా అన్నది మన ముందు అత్యున్నతమైన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఏపూరి సోమన్నను చాలా రోజుల తర్వాత కలుసుకున్నానని చెప్పారు.
తాను గురుకులాల సెక్రటరీగా ఉన్న రోజుల్లో ఏపూరి సోమన్న నిర్వహించిన స్వేరో జ్ఞాన చైతన్య యాత్ర అద్భుతంగా కొనసాగిందని కొనియాడారు. ఎంతో మంది అణచివేతకు గురైన వర్గాల బిడ్డలను విద్య వైపు మళ్లించి ప్రయోజకులను చేసిందన్నారు. నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిచేందుకు తాను కూడా భాగం అవుతానని మాటిచ్చాడంటూ తెలిపారు.