అమిత్ షాపై ఈశ్వరప్ప ఫైర్
బీఎస్ యడ్యూరప్పపై ఆగ్రహం
కర్ణాటక – రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికారం కోల్పోయిన భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే చిన్నారిని లైంగికంగా వేధింపులకు గురి చేశాడంటూ మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాలిక తల్లి ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
తాజాగా ఎన్నికల్లో భాగంగా ఎంపీ సీట్లను ఖరారు చేసింది బీజేపీ హైకమాండ్. కానీ ఆశించిన మేర ఆశావహులకు టికెట్లు ఇవ్వడంలో విఫలం అయ్యారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో మాజీ మంత్రి , బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరప్ప సంచలన కామెంట్స్ చేశారు.
తనకు బీఎస్ యడ్యూరప్పకు మధ్య నెలకొన్న అగాధాన్ని పూడ్చడంలో కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఆశించిన మేర కృషి చేయలేదని ఆరోపించారు ఈశ్వరప్ప. ఇదిలా ఉండగా కర్ణాటకలో పేరు పొందిన షిమోగా నియోజకవర్గం నుంచి తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. విచిత్రం ఏమిటంటే బీఎస్ యడ్యూరప్ప కుటుంబంపైనే తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు ఈశ్వరప్ప. విచిత్రం ఏమిటంటే ఇక్కడ యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్రతో పోటీ పడనున్నారు.