NEWSNATIONAL

బీజేపీ కూట‌మికి ఓట‌మి త‌ప్ప‌దు

Share it with your family & friends

సీఎం ఎంకే స్టాలిన్ షాకింగ్ కామెంట్స్

త‌మిళ‌నాడు – డీఎంకే చీఫ్‌, త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. బీజేపీ కూట‌మికి ఓట‌మి త‌ప్ప‌ద‌ని జోష్యం చెప్పారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌రిగిన ప్ర‌చార స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు.

బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ ఈ దేశంలో ఉన్న వ్య‌వ‌స్థ‌ల‌ను స‌ర్వ నాశ‌నం చేసింద‌ని ఆరోపించారు. బ‌డా బాబులు, పారిశ్రామిక‌వేత్త‌లు, కార్పొరేట్ కంపెనీలు, అక్ర‌మ మార్గంలో కోట్లు వెన‌కేసుకున్న వాళ్ల‌కు, బ్యాంకుల‌లో రుణాలు తీసుకుని క‌ట్ట‌కుండా ఎగ్గొట్టిన వారికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వ‌త్తాసు ప‌లుకుతున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం ఎంకే స్టాలిన్.

ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు బీజేపీ కూట‌మిని సాగ‌నంపేందుకు సిద్ద‌మై ఉన్నార‌ని, ఇక ద‌క్షిణాదిన ఆ పార్టీకి పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌ని హెచ్చ‌రించారు. త‌మ‌ను విమ‌ర్శించ‌డం వ‌ల్ల వ‌చ్చే లాభం ఏమిటో బీజేపీ నేత‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు సీఎం. కులం, మ‌తం పేరుతో రాజ‌కీయాలు చేసే బీజేపీని ఎందుకు భ‌రించాల‌ని ప్ర‌శ్నించారు. ఆధిప‌త్య భావ‌జాలంతో ఉండిన బీజేపీ, దానికి బానిస పార్టీగా ఉన్న ఏఐఏడీఎంకే నాట‌కాల‌కు ముగింపు ప‌లికే స‌మ‌యం వ‌చ్చింద‌న్నారు.