మన్మోహన్ సింగ్ సేవలు భేష్
కితాబు ఇచ్చిన సీఎం ఎంకే స్టాలిన్
తమిళనాడు – డీఎంకే చీఫ్ , తమిళనాడు ముఖ్యమంత్రి తిరు ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఈ మేరకు దేశ రాజకీయాలలో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న ప్రధానమంత్రులలో ఒకరిగా గుర్తింపు పొందారు డాక్టర్ మన్మోహన్ సింగ్. ప్రపంచంలోనే అత్యున్నతమైన ఆర్థిక వేత్తగా కూడా పేరు పొందారు. తాజాగా ఆయన కీలక ప్రకటన చేశారు. తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయంపై స్పందించారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాజాగా సీఎం ఎంకే స్టాలిన్ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఆయన దేశానికి అందించిన సేవలు అత్యున్నతమైనవని, అత్యంత స్పూర్తి దాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా మీరు చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు తిరు ఎంకే స్టాలిన్. డీఎంకే తరపున , తమిళనాడు రాష్ట్ర ప్రజలందరి తరపున మన్మోహన్ సింగ్ కు ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు సీఎం.