పవన్ కళ్యాణ్ ప్రచారానికి బ్రేక్
వారాహి విజయభేరి సభ వాయిదా
పిఠాపురం – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన ఎన్నికల ప్రచార వారాహి విజయభేరి యాత్ర వాయిదా పడింది. ఆయనకు ఉనన్నట్టుండి జ్వరం రావడంతో వాయిదా వేయాల్సి వచ్చిందని జనసేన ప్రకటించింది. తిరిగి ఎప్పుడు టూర్ లో పాల్గొంటారనేది జ్వరం తగ్గాక ప్రకటిస్తామని తెలిపింది.
ఇదిలా ఉండగా అంతకు ముందు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు పర్యటించారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో మమేకం అయ్యారు. ఈ సందర్బంగా వారి సమస్యలను వినే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్.
పలు మండలాల్లో గడప గడప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఉన్నట్టుండి వైరల్ ఫీవర్ అటాక్ అయ్యిందని జనసేన పార్టీ వెల్లడించింది. జ్వరం తీవ్రత పెరగడంతో వైద్యులను సంప్రదించారు. పర్యటన వాయిదా వేసుకోవాలని లేక పోతే ఇబ్బంది తప్పదని సూచించారు. దీంతో జనసేన పార్టీ అధికారికంగా పవన్ టూర్ కు బ్రేక్ పడిందని వెల్లడించింది.