రేవంత్ మొగోనివైతే రుణ మాఫీ చేయ్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. చెప్పిన మాటలను చేసి చూపించే దమ్ము లేనప్పుడు ఎందుకు సీఎంగా ఉండడం అంటూ ప్రశ్నించారు కేటీఆర్. నువ్వు మొగోనివే అయితే వెంటనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
కోటి 67 లక్షల ఆడబిడ్డలకు రూ. 2,500 చేసి చూపెట్టాలని సవాల్ విసిరారు కేటీఆర్. ముసలవ్వలకు, ముసలయ్యలకు రూ.,4 వేల పెన్షన్ ఇచ్చి చూపెట్టాలని అన్నారు. ముందు 24 గంటల కరెంట్ ఎక్కడ ఉందని నిలదీశారు.
రేవంత్ రెడ్డి నువ్వు మొగోనివే అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకు రా అని అన్నారు కేటీఆర్. సంక్షేమ పథకాల పేరుతో మోసం చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్ కే దక్కుతుందన్నారు కేటీఆర్.
ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టడం ఈసారి ఎన్నికల్లో ఖాయమని జోష్యం చెప్పారు. తమ పార్టీ నుంచి చెత్త పోయిందన్నారు. ఎవరు వీడినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ పేరుతో తన వ్యక్తిగత జీవితంపై బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తున్న వారిని వదిలి పెట్టనంటూ హెచ్చరించారు.