NEWSTELANGANA

నిధుల బ‌దిలీ ఏమ‌య్యాయి..?

Share it with your family & friends

రేవంత్ రెడ్డిపై బ‌క్క జ‌డ్స‌న్ ఫైర్

హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌హిష్క‌రణ‌కు గురైన సీనియ‌ర్ నాయ‌కుడు, ద‌ళిత నేత బ‌క్క జ‌డ్స‌న్ నిప్పులు చెరిగారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. రైతు బంధు పైస‌లు రూ. 7,000 కోట్ల రూపాయ‌ల నిధులు బ‌దిలీ అయ్యాయ‌ని , అవి ఎవ‌రి ఖాతాల్లోకి వెళ్లాయో చెప్పాల‌ని సీఎంను డిమాండ్ చేశారు. బుధ‌వారం బ‌క్క జ‌డ్స‌న్ మీడియాతో మాట్లాడారు.

అస‌లు ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌నా లేక వివాదాస్ప‌ద కాంట్రాక్ట‌ర్ మేఘా కృష్ణా రెడ్డి తమ్ముడా అని ప్ర‌శ్నించారు. మేఘా త‌మ్ముడు చిట్టీ మీద రాసి ఇస్తే ఆర్ , బీ ట్యాక్స్ క‌ట్ చేసి డ‌బ్బులు విడుద‌ల చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బ‌క్క జ‌డ్స‌న్ .

రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి బండారం బ‌య‌ట పెడ‌తాన‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌స్తుత స‌ర్కార్ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు సీఎం ప‌ని చేస్తున్నారంటూ నిల‌దీశారు కాంగ్రెస్ బ‌హాష్కృత నేత‌. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.